నాపై వస్తున్న వదంతులు నమ్మవద్దు: దేవినేని అవినాష్
- మీడియాతో మాట్లాడిన తెలుగు యువత అధ్యక్షుడు
- ఓర్వలేక తనపై పుకార్లు పుట్టిస్తున్నారని వెల్లడి
- ఎప్పుడూ అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా
ఇలాంటి ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. ప్రజాసమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని, టీడీపీ కార్యకర్తలకు, దేవినేని నెహ్రూ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కొడాలి నానిపై ఓటమిపాలయ్యారు.