Telangana: రేపు కుటుంబ సభ్యులతో డిపోల ముందు ప్రదర్శన... భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • 16వ రోజుకు చేరిన సమ్మె
  • సమ్మె మరింత ఉద్ధృతం చేయాలని జేఏసీ నిర్ణయం

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 16వ రోజుకి చేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 21న అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొంటారు. ఈ నెల 22న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు తమ పొట్టకొట్టవద్దంటూ విజ్ఞప్తులు చేస్తూ నిరసన ప్రదర్శనలు ఉంటాయని జేఏసీ వెల్లడించింది. ఈ నెల 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు కోరాలని నిర్ణయించారు.

అనంతరం ఈ నెల 24న మహిళా కండక్టర్లతో దీక్షలు, 25న హైవేల దిగ్బంధనం, రాస్తారోకోలు నిర్వహించనున్నారు. ఈ నెల 26న ఆర్టీసీ కార్మికుల పిల్లలతో డిపోల వద్ద దీక్షలు చేపట్టాలని నిశ్చయించారు. పండుగకు జీతాలు లేకపోవడంతో ఈ నెల 27న దీపావళి సందర్భంగా నిరసన చేపడతారు. ఈ నెల 30న 5 లక్షల మందితో సకల జనుల సమరభేరి కార్యక్రమం ఉంటుంది.

  • Loading...

More Telugu News