Tsrtc: రేపు ప్రగతి భవన్ ముట్టడి.. వ్యూహంపై చర్చించిన కాంగ్రెస్ నేతలు!

  • షబ్బీర్ అలీ నివాసంలో నేతల భేటీ
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెపై దిగిరాని ప్రభుత్వం
  • ప్రభుత్వంపై జేఏసీ, మద్దతుగా నిలిచిన పార్టీలు ఫైర్

కార్మికుల సమ్మెపై ప్రభుత్వం దిగి రాకపోవడంపై ఆర్టీసీ జేఏసీ, వారికి మద్దతుగా నిలిచిన పార్టీలు మండిపడుతున్నాయి. కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు సూచనను సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కార్మికులు, పలు పార్టీలు తమ నిరసన కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో రేపు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో ముట్టడికి వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Tsrtc
congress
pagathi bhavan
Shabbir Ali
  • Loading...

More Telugu News