Hyderabad: నేను కన్నీళ్లు పెట్టుకున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నా: పరుచూరి గోపాలకృష్ణ

  • హైదరాబాద్ లో మా సభ్యుల సమావేశం
  • హాజరైన పరుచూరి గోపాలకృష్ణ
  • కన్నీళ్లు పెట్టుకున్నట్టు మీడియాలో వార్తలు

హైదరాబాద్ లో నిర్వహించిన 'మా' సభ్యుల సమావేశం నుంచి సుప్రసిద్ధ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకుని బయటికి వచ్చారంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. నటుడు పృథ్వీ చెప్పడంతో మీడియాలో ఈ విషయం ప్రముఖంగా ప్రసారమైంది. అయితే దీనిపై పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా వివరణ ఇచ్చారు. 'మా' సమావేశం నుంచి తాను కంటతడి పెట్టుకుని బయటికి వచ్చినట్టు కొన్ని మీడియా చానల్స్ లో వార్తలు వస్తున్నాయని, వాటిని తాను ఖండిస్తున్నానని అన్నారు. తాను 'మా' సభ్యుల సమావేశానికి హాజరైంది నిజమేనని, అయితే కొందరి సభ్యుల తీరు తనకు నచ్చలేదని, అందుకే బయటికి వచ్చేశాను తప్ప, కంటతడి పెట్టుకున్నాననడంలో వాస్తవంలేదని స్పష్టం చేశారు.

Hyderabad
MAA
Paruchuri Gopalakrishna
Tollywood
  • Loading...

More Telugu News