Telangana: తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి... ప్రభుత్వ వైఖరి వల్లే అంటున్న కుటుంబ సభ్యులు!

  • గుండెపోటుతో ఖాజామియా మృతి
  • సత్తుపల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఖాజామియా
  • విచారం వ్యక్తం చేసిన తెలంగాణ, ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు కార్మికులు మృతి చెందడం తెలిసిందే. తాజాగా ఖాజామియా అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మరణించారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఖాజామియా ఆవేదనకు గురయ్యాడని, ప్రభుత్వ వైఖరి వల్లే ఖాజామియా చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న 55 ఏళ్ల ఖాజామియా గత 15 రోజులుగా సమ్మెలో పాల్గొన్నారు. సహచర కార్మికుడు మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మిక సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

Telangana
TSRTC
Driver
Khammam District
Khajamia
Sattupalli
  • Loading...

More Telugu News