pok: పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై శతఘ్నులతో భారత్ దాడి.. 15 మంది ఉగ్రవాదుల హతం
- ఆర్మీ పోస్టులూ ధ్వంసమైనట్లు సమాచారం
- పీవోకేలో నక్కిన ఉగ్రవాదులు
- నీలం ఘాట్ ప్రాంతంలో దాడులు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో భారత్ ఈ రోజు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో దాదాపు 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. అలాగే, పాక్ ఆర్మీ పోస్టులూ ధ్వంసమైనట్లు సమాచారం. బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేపట్టిన తర్వాత చేస్తున్న దాడులివి. బాలాకోట్ దాడులతో పాక్ సైన్యం సాయంతో పీవోకేలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు.
మరోవైపు, భారత సైనికులే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో పీవోకేలో భారత్ దాడులు చేసింది. ఈ దాడులు తాంగ్ధర్ సెక్టార్‌కు ఎదురుగా ఉండే నీలం ఘాట్ ప్రాంతంలో జరిగాయి. పీఓకేలో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టాయని భారత సైన్య ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ వివరాలను ఆర్మీ అధికారులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.