Crime News: కూతురి ఆత్మహత్య... తట్టుకోలేక తల్లి బలవన్మరణం

  • ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్న కుమార్తె
  • దీన్ని భరించలేక తల్లి కూడా అదే బాట
  • సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఘటన

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడితే, ఈ విషయాన్ని తట్టుకోలేక తల్లికూడా బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెల్లగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన మాశెట్టి నాగమ్మ (40), గంగమ్మ (68) తల్లీకూతుళ్లు.  ఇద్దరూ వితంతువులే. రాళ్లు కొట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి నాగమ్మ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురి మరణంతో దిగ్భ్రమకు గురైన గంగమ్మ కాసేపటికి తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. స్థానికులను విచారించిన అనంతరం ఆర్థిక ఇబ్బందులవల్లే నాగమ్మ చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారించారు.

Crime News
mother and daughter suicide
Sangareddy District
kandi mandal
  • Loading...

More Telugu News