Guntur District: తాడేపల్లిలోని ఓ ఇంట్లో పేలుడు...స్థానికంగా కలకలం

  • ప్రకాశ్‌నగర్‌లో హఠాత్తుగా శబ్దం
  • ఏం జరిగిందో అర్థంకాక ఆందోళన
  • ఫ్రిజ్‌ సిలెండర్‌ వల్లే  బ్లాస్టని ప్రాథమికంగా నిర్థారణ

ఓ ఇంట్లో జరిగిన పేలుడు కారణంగా ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికంగా ఈ ఘటన కలకలానికి కారణమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌లో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇంటి తలుపులు, ఇనుప గేట్లు విరిగిపడ్డాయి. ఏం జరుగుతోందో అర్థంకాక స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.

పేలుడు కారణంగా పుట్టిన మంటలు అంటుకుని ఇంట్లో ఉన్న పైడమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కారణాలను అన్వేషించారు. ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌ నుంచి గ్యాస్‌ లీకైన కారణంగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని ప్రాథమికంగా నిర్థారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Guntur District
tadepalli
blast
house
one injured
  • Loading...

More Telugu News