Crime News: వివాదంలో జోక్యం చేసుకున్నాడని ఆర్మీ జవాను హత్య : వరంగల్‌ జిల్లాలో దారుణం

  • నర్సంపేట పట్టణంలో  ప్రేమ్‌కుమార్‌పై దాడి
  • పుట్టిన రోజు వేడుకలలో గొడవ
  • సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన జవాను

పుట్టిన రోజు వేడుకల్లో జరిగిన గొడవ అతని ప్రాణాలమీదికి తెచ్చింది. పెద్దరికంగా రెండు వర్గాలకు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఓ వర్గం వ్యక్తులు కత్తులతో పొడవడంతో తీవ్రంగా గాయపడి అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల కథనం మేరకు...వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణం వల్లభ్‌నగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్‌ ఆర్మీజవాను. నిన్నరాత్రి తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు జరిగితే ప్రేమ్‌కుమార్‌ హాజరయ్యాడు. అక్కడ ప్రేమ్‌కుమార్‌ స్నేహితుడి వర్గానికి, మరో వర్గానికి మధ్య గొడవ జరిగింది.

ఈ సందర్భంలో ప్రేమ్‌కుమార్‌ జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇది నచ్చని దూదిమెట్ల దిలీప్‌కుమార్‌, మరో ఇద్దరు  ప్రేమ్‌కుమార్‌పై దాడికి దిగారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

Crime News
Warangal Urban District
narsampeta
army javan murdered
  • Loading...

More Telugu News