Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 2,44,941.30 కోట్లు!

  • బహిరంగ మార్కెట్ రుణాలే రూ. 1.55 లక్షల కోట్లు
  • కేంద్రం నుంచి రూ. 10,229 కోట్లు
  • తీర్చేందుకు 2040 వరకూ సమయం
  • లెక్కలు తేల్చిన ఆర్థిక శాఖ అధికారులు

ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 2.45 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలున్నాయని, వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే 2040 వరకూ సమయం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు కట్టింది. బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు, విదేశాల సాయం, నాబార్డ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలన్నీ కలుపగా, మొత్తం రూ. 2,44,941.30 కోట్ల రూపాయలుగా తేలింది.

వీటిలో బహిరంగ మార్కెట్ నుంచి రూ. 1.55 లక్షల కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న రూ. 10,229 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల ద్వారా రూ. 12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ తదితరాల నుంచి రూ. 14,767 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ నిధులు రూ. 52,064 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. నాబార్డ్ నుంచి, 'ఉదయ్' పథకం కింద తీసుకున్న రుణాలను 2030-31 వరకూ తీర్చివేయవచ్చని, మిగతా మొత్తం తీరాలంటే, ఇంకో పదేళ్ల వరకూ పడుతుందని అంచనా వేస్తున్నారు.

Andhra Pradesh
Loans
Finance Ministry
  • Loading...

More Telugu News