Asaduddin Owaisi: అది డ్యాన్స్ కాదు భాయ్... వివరణ ఇచ్చిన అసదుద్దీన్!

  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్
  • గాలిపటాన్ని ఎగరేస్తున్నట్టు చూపించాను
  • మరోసారి వీడియో చూసుకోవాలన్న అసద్

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వేసిన స్టెప్పులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రచార సభలో పాల్గొన్న అనంతరం మెట్లు దిగుతూ అసద్ వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. వీటిపై ఎన్నో కామెంట్లు రాగా, తాజాగా అసద్ వివరణ ఇచ్చారు. అదేమీ డ్యాన్స్ కాదని ఆయన అన్నారు. తమ పార్టీ గుర్తు గాలిపటమని గుర్తుచేసిన ఆయన, గాలిపటాన్ని ఎగరేసినప్పుడు చేతులను ఎలా తిప్పుతామో, అదే తాను చేశానని అన్నారు. ఆ దృశ్యాన్ని మరోసారి చూడాలని, అప్పుడు తాను డ్యాన్స్ చేశానా? లేక గాలిపటాన్ని ఎగరేస్తున్నట్టుగా ఊహించుకుని, దాని తాడును లాగానా? అన్న విషయం తెలుస్తుందన్నారు.

Asaduddin Owaisi
Dance
Maharashtra
  • Loading...

More Telugu News