MEIL: వెలిగొండ-2 పనులు కూడా మేఘాకే... రివర్స్ టెండర్ ద్వారా రూ. 61 కోట్లు ఆదా!

  • రూ. 491.37 కోట్లకు టెండర్
  • గత బిడ్తో పోలిస్తే 7 శాతం తక్కువ
  • రుత్విక్ పటేల్ కన్నా తక్కువ కోట్ చేసిన మేఘా

రివర్స్ టెండరింగ్ విధానంలో పోలవరం పనులను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కే వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులు దక్కాయి. ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండర్ బిడ్ లో 7 శాతం తక్కువకు కోట్ చేసిన మేఘా అధికారులు, రూ. 491.37 కోట్లకే పనులు చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ప్రభుత్వానికి రూ. 61.76 కోట్లు ఆదా అయింది. మేఘాతో పాటు రుత్విక్ పటేల్, ఆర్ఆర్సీఐఏ తదితర సంస్థలు కూడా బిడ్లను దాఖలు చేశాయి.

గతంలో ఈ పనులను దక్కించుకుని ప్రస్తుతం ఎల్1గా నిలిచిన రుత్విక్, 4.69 శాతం తక్కువ కోట్ చేస్తూ, రూ. 512.50 కోట్లకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ, అంతకన్నా తక్కువకే మేఘా టెండర్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ విధానంతో ప్రభుత్వానికి రూ. 61.76 కోట్లు ఆదా కావడం సంతోషంగా ఉందని జలవనరుల శాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News