Amazon: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ దీపావళి ధమాకా సేల్స్

  • ఈ కామర్స్ బరిలో దిగ్గజాల హోరాహోరీ
  • ప్రత్యేక ఆఫర్లతో వినియోగదార్లను ఊరిస్తున్న కంపెనీలు
  • ఈ నెల 21 నుంచి 25 వరకు ఆఫర్లు

దీపావళి పండగ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి.  ఇటీవల ఈ రెండు సంస్థలు దసరా పండగకు ఇదే రీతిలో ప్రత్యేక ఆఫర్లతో ఆన్ లైన్ కొనుగోలుదార్లను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఫ్లిఫ్ కార్ట్ బిగ్ దివాలీ సేల్ పేరిట సందోహానికి తెరదీయగా , అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ సేల్ పేర  ఈ నెల 21 నుంచి 25 వరకు కొనుగోలు దార్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనుంది. అమెజాన్ సంస్థ శాంసంగ్, నోకియా, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు,ల్యాప్ టాప్ లు, ఎకో తదితర ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు ప్రకటించనుండగా, ఫ్లిప్ కార్ట్ కూడా ప్రముఖ బ్రాండ్ల మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, కెమెరాలపై ఆఫర్లను ప్రకటించనుంది.

Amazon
Flipkart
India
  • Loading...

More Telugu News