Telangana: బంద్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: ఆర్టీసీ జేఏసీ

  • ముగిసిన ఆర్టీసీ జేఏసీ సమావేశం
  • రేపు రాజకీయ పార్టీలతో భేటీ
  • ఈ నెల 23న ఓయూలో భారీ బహిరంగ సభ

హైదరాబాద్ లో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా బంద్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. తాజా పరిణామాలపై ఆర్టీసీ జేఏసీ రేపు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. అంతేకాకుండా, ఈ నెల 23న ఓయూలో ఆర్టీసీ కార్మికుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

బంద్ పై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ బంద్ కు ప్రజలు సంపూర్ణంగా సహకరించారని తెలిపారు. ఇకపై సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. రేపు అన్ని కూడళ్లలో ప్లకార్డులతో ప్రదర్శనలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆర్టీసీని రక్షించండి-ప్రజా రవాణాను కాపాడండి అనే నినాదంతో ముందుకెళతామని వివరించారు.

Telangana
TSRTC
JAC
  • Loading...

More Telugu News