Rajinikanth: తనను ఫాలో అయిన అభిమానిని ఇంట్లోకి పిలిచి మందలించిన రజనీకాంత్!

  • హిమాలయాల నుంచి వచ్చిన రజనీ
  • చెన్నై ఎయిర్ పోర్టులో తలైవాకు ఘనస్వాగతం
  • ఇంటి వరకు బైక్ పై ఫాలో అయిన అభిమాని

తమిళ తలైవా రజనీకాంత్ నిరాడంబరతకు మారుపేరుగా ఉంటారు. తన కోసం వెర్రి అభిమానం ప్రదర్శించడం ఆయనకు ఇష్టముండదు. ఇటీవలే హిమాలయాలకు వెళ్లిన రజనీ అక్కడ ధ్యానం ముగించుకుని శుక్రవారం చెన్నై వచ్చారు. అర్ధరాత్రి సమయం అయినా సరే తలైవా కోసం అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ నవ్వుతూ అభివాదం చేసిన రజనీ ఇంటికి చేరుకునే క్రమంలో ఓ అభిమాని ఆయనను బైక్ పై ఫాలో అయ్యాడు.

దీన్ని తీవ్రంగా పరిగణించిన రజనీకాంత్ ఇంటికి చేరగానే ఆ అభిమానిని లోపలికి పిలిచారు. ఇంత రాత్రివేళ బైక్ పై ప్రయాణించడం ఏమంత క్షేమకరం కాదని మందలించారు. మరోసారి ఇలా ఫాలో కావొద్దని చెప్పడమే కాకుండా ఆ అభిమానితో ఓ ఫొటో కూడా దిగారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆ అభిమానే స్వయంగా వెల్లడించాడు.

Rajinikanth
Fan
Chennai
Tamilnadu
  • Loading...

More Telugu News