agrogold: అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు!

- డిపాజిట్ దారుల కోసం రూ.264 కోట్లు విడుదల
- పది వేల రూపాయల లోపు డిపాజిట్ దారులకు తొలుత చెల్లింపులు
- ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు
సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల కోసం రూ.264 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పది వేల రూపాయల లోపు డిపాజిట్ దారులక తొలుత చెల్లింపులు చేయనున్నారు.
