Telugudesam: పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్న చంద్రబాబును అరెస్టు చేయాలి: వైసీపీ నేతల డిమాండ్

  • గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • ఈ మేరకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
  • చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలి

పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడుతున్నారని, డీజీపీ గౌతం సవాంగ్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని విమర్శించారు.

Telugudesam
varla ramaiah
Chandrababu
YSRCP
  • Loading...

More Telugu News