Osmania University: రేపు బంద్ నేపథ్యంలో ఓయూ పరిధిలో జరిగే పరీక్షలు వాయిదా
- కొత్త పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న వర్శిటీ
- రవాణా ఇబ్బందుల నేపథ్యంలో నిర్ణయం
- ఓయూ అధికారుల వెల్లడి
రేపు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటన చేశారు. వాయిదా పడ్డ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయాణ సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.