Andhra Pradesh: ఏపీలో అర్చక అకాడమీ, ట్రైనింగ్ సంస్థ డైరెక్టర్ గా కామేశ్వర శర్మ

  • మంత్రి వెల్లంపల్లిని కలిసిన కామేశ్వర శర్మ
  • అర్చక అకాడమీ ద్వారా అర్చకులకు శిక్షణ
  • దేవాలయ నిర్వహణ పూజా విధానం, కైంకర్యాలపై శిక్షణ

ఏపీలో అర్చక అకాడమీ, ట్రైనింగ్ సంస్థ డైరెక్టర్ గా కామేశ్వర శర్మ (కృష్ణ శర్మ)ను నియమించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కామేశ్వర శర్మ, ఆగమ సలహాదారు  శివ ప్రసాద్ శర్మ, ప్రముఖ సిద్ధాంతి కప్పగంతుల సోమయాజులు తదితరులు కలిశారు. తమకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, అర్చక అకాడమీ ద్వారా అర్చకులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణతో పాటు దేవాలయ నిర్వహణ పూజా విధానం, కైంకర్యాలపై శిక్షణ తరగతులు ఉంటాయి. ఆగమ సభలో జ్యోతిష్య సభలు వేద, శాస్త్ర సభలు నిర్వహించడం జరుగుతుంది. అరకు, పాడేరు వంటి గిరిజన ప్రాంతాల్లోని చిన్న చిన్న దేవాలయాలలో గిరిజనులు స్వయంగా వారి దేవతలకు పూజలు చేసుకునే విధానంపై కూడా వారికి శిక్షణ ఇవ్వడం కూడా ఇందులో భాగమేనని అన్నారు.

Andhra Pradesh
Archaka academy
  • Loading...

More Telugu News