Harish Rao: హరీశ్ రావు మౌనం వీడాలి.. ప్రజా క్షేత్రంలోకి రావాలి: అశ్వత్థామరెడ్డి
- హరీశ్ రావు మౌనం మంచిది కాదు
- కేసీఆర్ వ్యాఖ్యలు నోటితో నవ్వి, నొసటితో వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి
- నాకు అక్రమాస్తులు ఉంటే ఉరిశిక్షకు కూడా సిద్ధమే
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి హరీశ్ రావు ఇప్పటి వరకు స్పందించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, హరీశ్ రావు మౌనంగా ఉండటం మంచిది కాదని, మౌనం వీడాలని, ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నోటితో నవ్వి, నొసటితో వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయని చెప్పారు. మేము చెప్పిన విషయాల్లో తప్పుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబుతామని, రేపే విధుల్లో చేరుతామని తెలిపారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నట్టు తేలితే బహిరంగ ఉరిశిక్షకు కూడా సిద్ధమేనని తెలిపారు.