High Court: ప్రజలు తిరగబడితే తట్టుకోలేరు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చురక

  • ఆర్టీసీ సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారు?
  • ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులు  
  •  ఆర్టీసీకి కొత్త ఎండీని ఎందుకు నియమించలేదు?

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరికొంత మంది ఆర్టీసీకి మద్దతు తెలిపితే ఆందోళనను ఎవరూ ఆపలేరని కామెంట్ చేసింది.

ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులని... వారు తిరగబడితే తట్టుకోలేరని వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కొత్త ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఆర్టీసీకి సమర్థవంతమైన ఇన్ ఛార్జి ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఆయన సమర్థవంతుడు అయినప్పుడు ఆయననే ఎండీగా నియమించవచ్చు కదా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.

High Court
Telangana
RTC Strike
TRS
  • Loading...

More Telugu News