Uttar Pradesh: మహిళల శాపం తగిలింది... ఎస్పీ నేతపై జయప్రద సంచలన విమర్శలు!

  • యూపీలోని రాంపూర్ లో ఎన్నికల ప్రచారం
  • మహిళల శాపంతోనే ఆజం ఖాన్ పై కేసులు
  • ప్రచార సభల్లో నటిస్తున్నారని ఎద్దేవా

సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ పై సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన విమర్శలు చేశారు. ఆజం ఖాన్ వల్ల ఎంతో మంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని, వారందరి శాపాలూ ఆయనకు తగిలాయని నిప్పులు చెరిగారు. మహిళల శాపాల వల్లనే ఆయన్ను భూ కబ్జా కేసులు చుట్టుకున్నాయని అన్నారు. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జయప్రద, ఆయనిప్పుడు ప్రచార సభల్లో రోదిస్తున్నాడని, తనను మంచి నటి అని చెప్పే ఆయన, ఇప్పుడు సభల్లో తనకన్నా అద్భుతంగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Uttar Pradesh
Rampur
Jayaprada
Azamkhan
  • Loading...

More Telugu News