Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం రూ. 306 కోట్లు!

  • 2017-18తో పోలిస్తే 66 శాతం అధికం
  • మూలవేతనం మాత్రం 2.3 మిలియన్ డాలర్లే
  • స్టాక్ ఆప్షన్స్ కింద 29.6 బిలియన్ డాలర్లు

ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల గడచిన ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 305 కోట్లు (42.9 మిలియన్‌ డాలర్లు) అందుకున్నారు. 2017-18తో పోలిస్తే, ఇది 66 శాతం అధికం కావడం గమనార్హం. ఆయన మూలవేతనం 2.3 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ ఆప్షన్స్ కింద దాదాపు 29.6 మిలియన్ డాలర్లను ఆయన అందుకున్నారు.

 2017-18లో సత్య, 25.8 మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకోగా, గత సంవత్సరం ఆర్థిక ఫలితాల్లో మెరుగుదల కారణంగా, ఆయన వేతనం పెరిగింది. సత్య నాదెళ్ల నాయకత్వంలోని మైక్రోసాఫ్ట్ టీమ్, పలు కొత్త సాంకేతికతలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనడంలోనూ ముందు నిలిచింది. ఈ కారణంతోనే ఆయన వేతనం కూడా పెరిగిందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సత్య నాదెళ్ల గత ఐదేళ్లుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ గా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News