Andhra Pradesh: ఇకపై నవంబరు 1నే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: ఏపీ ప్రభుత్వం నిర్ణయం

  • జూన్ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షలు నిర్వహించిన గత ప్రభుత్వం
  • నవంబరు 1 నాడే నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం
  • ఏర్పాట్లపై 21న అధికారులతో సీఎస్ సమావేశం

రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న కాకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1నే అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నెలకొన్న గందరగోళం మధ్యనే గత ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రభుత్వం ఏర్పడిన 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షల పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది. అయితే, ఇకపై ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1నే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ నెల 21న పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

Andhra Pradesh
formation day
Jagan
  • Loading...

More Telugu News