Amit Shah: ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రిగా మళ్లీ ఫడ్నవీస్: అమిత్ షా స్పష్టీకరణ

  • శివసేన ఆశలపై  నీళ్లు
  • సీఎం పదవిపై శివసేన వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోబోమన్న అమిత్ షా
  • ఇరు పార్టీల మధ్య అభిప్రాయభేదాలు లేవన్న బీజేపీ చీఫ్  

మహారాష్ట్రలో సీఎం పదవి దక్కించుకోవాలన్న శివసేన పార్టీ కల నెరవేరేలా లేదు. అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే.. మళ్లీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఈ విషయంలో శివసేన పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న వాదనలు కూటమికి హాని చేయవని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య విభేదాలు లేవని అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 288 నియోజక వర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ ఈ నెల 21 జరుగనుంది.

Amit Shah
BJP
Fadnavis
  • Loading...

More Telugu News