Kajal: రజనీతో కలసి నటించాలనే కల మాత్రమే మిగిలిపోయింది: కాజల్

  • తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్
  • యువ .. సీనియర్ హీరోలతో సినిమాలు 
  • రజనీ సరసన ఛాన్స్ కోసం వెయిటింగన్న కాజల్  

తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ రెండు భాషల్లోను సీనియర్ స్టార్ హీరోలతోను .. యువ కథానాయకులతోను కలిసి నటించింది. తెలుగులో చిరంజీవితో చేసిన ఆమె తమిళంలో కమల్ సరసన నాయికగా 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .." తమిళంలో అజిత్ .. విజయ్ వంటి స్టార్ హీరోలతో హిట్ మూవీస్ చేశాను. కమల్ సార్ తో 'ఇండియన్ 2' చేస్తున్నాను. ఇన్నేళ్ల నా కెరియర్లో రజనీ జోడీగా ఛాన్స్ రాలేదనే వెలితి ఒక్కటి వుండిపోయింది. త్వరలో రజనీ సరసన ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. రజనీ సరసన నటించాలనే కాజల్ కల ఎప్పుడు నిజమవుతుందో చూడాలి మరి.

Kajal
Rajani
  • Loading...

More Telugu News