Srinivasa Varma: శోభన్ బాబు గారి మాటలే నన్ను నటుడిగా నిలబెట్టాయి: 'సర్పయాగం' హీరో శ్రీనివాసవర్మ

  • శోభన్ బాబుగారు గొప్ప నటుడు 
  • నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు 
  • అయన సూచనలను ఆచరణలో పెట్టాను 

'సర్పయాగం' సినిమా ద్వారా తెలుగు తెరకి శ్రీనివాసవర్మ పరిచయమయ్యాడు. ఆ సినిమాలో ఆయన రోజాను ప్రేమించి మోసం చేసే వ్యక్తిగా నటించగా, రోజా తండ్రి పాత్రను శోభన్ బాబు పోషించారు. తాజాగా ఆ సినిమా గురించి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, "శోభన్ బాబుగారితో కలిసి నటించడం నా అదృష్టం. ఈ సినిమా ద్వారానే నాకు శోభన్ బాబుగారితో పరిచయమైంది.

ఈ సినిమా కోసం ఒకే హోటల్లో మేము ఉండేవాళ్లం. షూటింగు లేని రోజున నేను ఆయన రూముకు వెళ్లి కలిసేవాడిని. చిత్రపరిశ్రమ నాకు కొత్త గనుక ఇక్కడ ఎలా మసలుకోవాలనే విషయంలో ఆయన అనేక సలహాలు .. సూచనలు ఇచ్చేవారు. దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా కెరియర్ ను ఎలా కాపాడుకోవాలనే విషయాలను చెప్పేవారు. ఆయన మాటలను ఆచరణలో పెట్టడం వల్లనే నేను వివిధ భాషల్లో సినిమాలు చేయగలిగాను" అని చెప్పుకొచ్చాడు.

Srinivasa Varma
Sobhan Babu
  • Loading...

More Telugu News