GiriBabu: నాపై రామారావుగారికి లేనిపోనివి కల్పించి చెప్పారు: నటుడు గిరిబాబు

  • రామారావుగారు 'సింహబలుడు' చేస్తున్నారు
  • నేను కృష్ణతో 'సింహగర్జన' నిర్మిస్తున్నాను 
  • ఇద్దరి అభిమానుల మధ్య ఘర్షణ    

నటుడిగా .. దర్శక నిర్మాతగా గిరిబాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒకానొక సమయంలో తనకి ఎదురైన చిత్రమైన పరిస్థితిని గురించి ప్రస్తావించారు."ఒక వైపున రామారావుగారు 'సింహబలుడు' సినిమా తీస్తున్నారు. అదే సమయంలో నిర్మాతగా నేను కృష్ణగారితో 'సింహగర్జన' సినిమా చేస్తున్నాను.

అప్పట్లో రామారావుగారికి .. కృష్ణగారికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను ఈ సినిమా తీస్తుండటంతో, నాపై రామారావుగారికి కొంతమంది లేనిపోనివి కల్పించి చెప్పారు. ఈ నేపథ్యంలో రామారావుగారి అభిమానులకి .. కృష్ణగారి అభిమానులకి మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. దాంతో నేను రామారావుగారి దగ్గరికి వెళ్లి, నా సినిమా కథ చెప్పాను. 'సింహబలుడు'కి .. 'సింహ గర్జన'కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాను. దాంతో నా పై చాడీలు చెప్పినవారిపై రామారావుగారు కేకలేశారు. నన్ను అభినందించి మరీ పంపించారు" అని చెప్పుకొచ్చారు.

GiriBabu
Rama Rao
  • Error fetching data: Network response was not ok

More Telugu News