five paise: భలే మంచి చౌక బేరం... ప్లేటు బిర్యానీ ఐదు పైసలు

  • తొలి వంద మందికి అదనంగా అర ప్లేట్‌ బోనస్‌
  • పురాతన నాణేలపై అవగాహనకు ఓ వ్యాపారి చిట్కా
  • క్యూ కట్టిన ఆహార ప్రియలు

ప్లేట్‌ బిర్యానీ ఎంతుంటుంది?... అబ్బో రూ.వంద పైనే ఉంటుంది. కానీ, అక్కడ మాత్రం ప్లేటు బిర్యాని ఐదు పైసలే. అదేంటి ఇప్పుడు ఐదు పైసల నాణాలు ఎక్కడ ఉన్నాయి? అనుకుంటున్నారా. అదే ఇక్కడి ట్విస్ట్‌. తమిళనాడులోని ఆర్కేనగర్‌లో పురాతన నాణేలు, వస్తువులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఓ వ్యాపారి ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ ఇది. కానీ అనూహ్యంగా ఐదు పైసల నాణేలతో భారీ సంఖ్యలో ఆహార ప్రియులు రావడం నిర్వాహకుడినే ఆశ్చర్యపరిచింది.

వివరాల్లోకి వెళితే...రాష్ట్రంలోని కీళడిలో 2300 ఏళ్లకు ముందు ప్రజలు ఉపయోగించిన వస్తువులు, నాణేలు ఇటీవల దొరికాయి. ఈ వస్తువులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. దిండుక్కల్‌  బస్టాండ్‌ సమీపంలో బిర్యానీ వ్యాపారం చేసే ముజిఫ్‌లో కూడా ఈ వార్త ఆసక్తి రేకెత్తించింది. పైగా, పురాతన సంపద ఎంతో విలువైనదని, వీటిపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉంటే వారి కంటపడిన ప్రాచీన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచడమో లేక సంబంధిత అధికారులకు అప్పగించడమో చేస్తారని భావించాడు.

ఇందుకోసం ఏం చేయాలా? అని ఆలోచిస్తే బిర్యాని ఆఫర్ ముజిఫ్ మదిలో మెదిలింది. అంతే, వెంటనే ఐదు పైసల నాణేనికి ప్లేటు బిర్యానీ అని, ముందు వచ్చిన వంద మందికి అర ప్లేటు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో భారీ సంఖ్యలో జనం బిర్యానీ కోసం ముజిఫ్‌ దుకాణం వద్ద క్యూకట్టారు.

ఈ సందర్భంగా ముజిఫ్ మాట్లాడుతూ 'ఇప్పుడు మనం ఉపయోగించే  కరెన్సీ, వస్తువులు భావితరాలకు తెలియాలంటే ప్రజలకు వాటిపై అవగాహన ఉండాలి. అందుకే నా వంతు ప్రయత్నమిది' అని తెలిపాడు.

  • Loading...

More Telugu News