Ashwin Babu: 'రాజుగారి గది 3' కోసం తమన్నాకు బదులుగా కాజల్ ను .. తాప్సీని కూడా సంప్రదించారట!

  • తమన్నా చాలా మార్పులు చెప్పారు 
  • మళ్లీ కొత్తగా సెట్ చేసేంత సమయం లేదు
  • అవికా ఈ సినిమాకి ప్లస్ అయిందన్న ఓంకార్  

ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'రాజుగారి గది 3' ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఓంకార్ మాట్లాడుతూ .."ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం తమన్నాను తీసుకున్నాము. అయితే కథలోను .. తన పాత్ర విషయంలోను తమన్నా చాలా మార్పులు చెప్పారు. అయితే మళ్లీ వాటన్నిటిని సెట్ చేసేంత సమయం మాకు లేదు. అందువలన తమన్నాకు బదులుగా మరో హీరోయిన్ తో ముందుకు వెళదామని భావించాము. ఈ ప్రయత్నంలో కాజల్ .. తాప్సీ లను కూడా సంప్రదించాము. అయితే వాళ్లు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. అందువలన అవికా గోర్ ను తీసుకున్నాము. ఆమె ఈ సినిమాకి ప్లస్ అయింది" అని  చెప్పుకొచ్చాడు.

Ashwin Babu
Avika
  • Loading...

More Telugu News