Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో యాపిల్ వర్తకులపై ఉగ్రవాదుల కాల్పులు

  • షోఫియాన్ ట్రంజ్ ప్రాంతంలో చెలరేగిన ఉగ్రవాదులు
  • ఓ వ్యాపారి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
  • నిన్న ఉదయం ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన పోలీసులు

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ట్రంజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. నిన్న సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన యాపిల్ వర్తకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. లోయలో విధ్వంసానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, భారత సరిహద్దు భద్రతా దళాలు వారి ఆటలు సాగనీయకుండా సమర్థంగా అడ్డుకుంటున్నాయి. నిన్న ఉదయం అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌మెహరా ప్రాంతంలో ఓ ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భారీ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Jammu And Kashmir
apple merchant
terrorists
  • Loading...

More Telugu News