Deepika Padukone: మేమిద్దరం సహజీవనం చేయకపోవడానికి కారణం ఇదే: దీపికా పదుకునే

  • ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత తెలుసుకోవడానికి ఏముంటుంది?
  • భారతీయ వివాహ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది
  • భార్యాభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం

బాలీవుడ్ స్టార్ నటీనటులు దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2013లో 'రామ్ లీలా' సినిమా సెట్ లో వీరు ప్రేమలో పడ్డారు. గత ఏడాది ఇటలీలో కుటుంబీకులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. మరోవైపు, మన దేశంలో సహజీవనం చేస్తున్న జంటలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో దీపికకు ఎదురైంది. పెళ్లికి ముందు మీరు, రణవీర్ సహజీవనం చేశారా? అనేదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్నకు దీపిక ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది.

పెళ్లికి ముందే సహజీవనం చేస్తే... పెళ్లయిన తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఏముంటుందని దీపిక ప్రశ్నించింది. ఇష్టపడ్డ వ్యక్తి గురించి ముందుగానే తెలుసుకోవాలనే కొందరు ఇలా చేస్తుంటారని... తనకు ఆ పద్ధతి ఇష్టం లేదని చెప్పింది. తామిద్దరం సరైన నిర్ణయమే తీసుకున్నామని భావిస్తున్నానని తెలిపింది. భారతీయ వివాహ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని... భార్యాభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పింది.

Deepika Padukone
Ranveen Singh
Bollywood
  • Loading...

More Telugu News