Journalist: ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే నిదర్శనం: చంద్రబాబునాయుడు

  • ‘జగన్ రౌడీ రాజ్యం’, ‘జగన్ ఫెయిల్డ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్ తో బాబు పోస్ట్
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
  • ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు!

ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్యను ఆయన ఖండించారు. ‘జగన్ రౌడీ రాజ్యం’, ‘జగన్ ఫెయిల్డ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్ తో చంద్రబాబు ఓ పోస్ట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని అన్నారు. సత్యనారాయణ తనకు ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా, చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

నెల్లూరులో జమీన్ రైతు సంపాదకుడిపై, మైనారిటీ వర్గానికి చెందిన జర్నలిస్ట్ పై, చీరాలలో జర్నలిస్ట్ పై, ఇలా వరుస దాడులకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.


Journalist
murder
Chandrababu
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News