Electricity: 23 వేలకు పైగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ విద్యుత్ కార్మికుల మహా ధర్నా

  • హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో మహా ధర్నా
  • జీపీఎఫ్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్
  • సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరిక

హైదరాబాదులో విద్యుత్ కార్మికులు మహా ధర్మా నిర్వహించారు. మింట్ కాంపౌండ్ లో ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కార్మికులుగా గుర్తించాలని కోరారు. ఈపీఎస్ఈబీ నిబంధనలను వర్తింపజేయాలని విన్నవించారు. 23,600 మంది ఆర్టిజన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన ఆర్టిజన్ ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. ఈనెల 23న వరంగల్ లో మహా ధర్నా నిర్వహిస్తామని... తమ సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Electricity
Employees
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News