Jagan: జగన్ ఇచ్చిన హామీని క్లిప్పింగ్ వేసి చూపించిన ధూళిపాళ్ల నరేంద్ర

  • ఏపీలో రైతు భరోసా పథకం ప్రారంభం
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ
  • ధూళిపాళ్ల నరేంద్ర మీడియా సమావేశం

ఏపీలో రైతు భరోసా పెట్టుబడి సాయం పథకంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్ తీరును తీవ్రంగా విమర్శించారు. 2017 జూలై 9న గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్ స్పష్టంగా ప్రకటించాడంటూ ఓ క్లిప్పింగ్ వేసి మరీ చూపించారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఒకే దఫాలో మే నెలలోనే రూ.12,500 చెల్లిస్తామని జగన్ ఆవేశంగా ప్రసంగించడం ఆ క్లిప్పింగ్ లో ఉంది.

దీనిపై ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.50 వేలు ఇస్తామని, ఏటా రూ.12,500 ఇవ్వడం జరుగుతుందని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ నేడు వైఎస్సార్ రైతు భరోసాకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమృద్ధి యోజన పథకంతో ముడివేసి తాము రూ.13,500 ఇస్తామని కోట్లు ఖర్చుపెట్టి పేపర్ ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు.

ఆనాడు జగన్ రైతు భరోసా పథకం ప్రకటించిన సమయంలో ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన పథకం లేదని, రూ.12,500 తామే ఇస్తామని జగన్ ప్రకటించాడని నరేంద్ర వివరించారు. కానీ ప్రధాన్ మంత్రి సమృద్ధి యోజన పథకం ప్రారంభం అయ్యాక ఈ ప్రభుత్వం దాన్ని కూడా తమ ఖాతాలో వేసుకుని రైతులకు ఏదో చేస్తున్నామని భ్రమల్లో ముంచెత్తుతున్నారని ఆరోపించారు.

Jagan
Dhulipala Narendra Kumar
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News