YS Viveka: వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు

  • ఇటీవలే హత్యకు గురైన వైఎస్ వివేకా
  • వర్ల రామయ్య వ్యాఖ్యలపై పోలీసుల దృష్టి
  • సాక్ష్యాలతో సహా సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టీకరణ

వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. ఇటీవల వర్ల రామయ్య తరచుగా వివేకా హత్యపై వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకే, సీఎఆర్పీసీ 160 కింద వర్ల రామయ్యకు నోటీసులు పంపారు. సాక్ష్యాలతో సహా సిట్ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. అటు వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా ఎస్పీని కలిశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు తీరుతెన్నులపై ఎస్పీతో మాట్లాడారు.

YS Viveka
Varla Ramaiah
SIT
Police
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News