Vijayanagaram: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం... దైవదర్శనం చేసుకున్న ఏపీ మంత్రులు

  • పట్టువస్త్రాలు సమర్పించిన బొత్స
  • అమ్మవారిని దర్శించుకున్న పుష్పశ్రీవాణి, వెల్లంపల్లి
  • సిరిమానును అధిరోహించిన ప్రధాన పూజారి

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎప్పట్లాగానే అత్యంత ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు విచ్చేశారు. అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించారు. విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట సెంటర్ వరకు ఊరేగింపు సాగనుంది. కాగా, ప్రభుత్వం తరఫున పైడితల్లి అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వారే కాకుండా ఇతర మంత్రులు పుష్పశ్రీవాణి, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

Vijayanagaram
Paidithalli
Sirimanu
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News