JNU: నేనూ జైలు జీవితం గడిపాను!: నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ

  • జేఎన్ యూలో చదువుతున్న రోజుల్లో సంఘటన 
  • తీహార్ జైల్లో 10 రోజులు గడిపాను
  • ఓ ఇంటర్వ్యూలో అభిజిత్ వెల్లడి

నోబెల్ బహుమతికి ఎంపికైన ఇండో- అమెరికన్ అభిజిత్ బెనర్జీ జైలు శిక్షను కూడా అనుభవించారు. ఢిల్లీలోని జేఎన్ యూలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో ఓ నిరసనలో పాల్గొంటున్న సమయంలో అభిజిత్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. 1983లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ నిరసన సమయంలో అభిజిత్, సహ విద్యార్థులు విశ్వ విద్యాలయం కులపతిని ఆయన ఇంట్లోనే ఘెరావ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ జరిపారు. ఈ విషయాలను అభిజిత్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పది రోజుల పాటు జైలులో ఉన్నామని, తమను హింసించారని చెప్పారు. తొలుత తమపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి, కొన్ని రోజుల అనంతరం వాటిని ఎత్తివేశారని అభిజిత్ తెలిపారు.

JNU
Nobel award
winner
Abhijit Banerjee
jail
  • Loading...

More Telugu News