Jagan: సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన కళా వెంకట్రావు

  • సీఎంకు 15 ప్రశ్నలు సంధించిన టీడీపీ ఏపీ చీఫ్
  • రైతులను నిలువునా ముంచారంటూ విమర్శలు
  • తడిగుడ్డతో గొంతుకోశారని మండిపాటు

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో సీఎంకు 15 ప్రశ్నలు సంధించారు. రైతుల గురించి మీరు చెప్పింది కొండంత, చేస్తోంది గోరంత అని విమర్శించారు. రుణమాఫీ జీవో రద్దుతో రైతులను నిలువునా ముంచారని, రైతు భరోసా సాయంలో కోత విధించి తడిగుడ్డతో గొంతు కోశారని మండిపడ్డారు. 64 లక్షల మందికి సాయం అని చెప్పి 54 లక్షలకు కుదించారని ఆరోపించారు.

కౌలురైతుల విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని, 15.36 లక్షల కౌలురైతుల సంఖ్యను 3 లక్షలకు కుదించారని కళా వెంకట్రావు విమర్శించారు. రూ.7,500 ఇస్తూ రూ.13,500 ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం దారుణమని తెలిపారు. టీడీపీ హయాంలో రూ.50 వేల లోపు రుణాలను ఒకేసారి రద్దుచేశామని వివరించారు. ఇప్పుడు రుణమాఫీ పథకాల రద్దుతో రైతులను మోసం చేసింది నిజం కాదా? అని నిలదీశారు.

Jagan
Kala Venkatarao
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News