Infosys: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులపై బయోపిక్

  • చిత్రం టైటిల్ 'మూర్తి'
  • దర్శకత్వం వహించనున్న అశ్వినీ అయ్యర్
  • త్వరలోనే ప్రారంభం కానున్న 'మూర్తి'

భారత్ లో ఐటీ విప్లవానికి నాంది పలికిన మూలపురుషుల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒకరు. ఆయన విజయగాథలో అర్ధాంగి సుధా నారాయణమూర్తికి ఎనలేని పాత్ర ఉంది. ఇప్పుడు వీరిద్దరి జీవితాల ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రం పేరు 'మూర్తి'. ఈ బయోపిక్ కు అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. అశ్వినీ గతంలో 'బరేలీ కి బర్ఫీ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న 'పంగా' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత 'మూర్తి' చిత్రం ప్రారంభం కానుంది. 'మూర్తి' చిత్రానికి అశ్వినితో పాటు ఆమె భర్త నితీశ్, మహావీర్ జైన్ లు కూడా నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News