Kutti Padmini: జయలలితగారి దగ్గర చాలా చనువు ఉండేది: సీనియర్ నటి కుట్టి పద్మిని

  • జయలలితగారి ఇంటికి దగ్గరలో ఉండేవాళ్లం 
  • ఆమెతో కలిసి 17 సినిమాల్లో నటించాను 
  •  సెట్స్ లో ఆమె నగేశ్ తో ఎక్కువగా మాట్లాడేవారు

బాలనటిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన కుట్టి పద్మిని, ఆ తరువాత ఆయా చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. అలాగే అనేక సీరియల్స్ ద్వారా ఆమె ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .."బాలనటిగా నేను తెలుగు .. తమిళ భాషల్లో చాలా సినిమాలు చేశాను. జయలలితగారితో కలిసి 17 సినిమాలు చేశాను. అందువలన ఆమె దగ్గర నాకు ఎక్కువ చనువు ఉండేది.

అప్పట్లో జయలలితగారి ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు ఉండేది. మా అమ్మగారికి జయలలితగారి అమ్మగారితో మంచి స్నేహం వుంది. అందువలన మంచి సంబంధాలు ఉండేవి. సెట్స్ లో జయలలితగారు ఎక్కువగా పుస్తకాలు చదువుకునేవారు. నేను వుంటే నాతోనే ఎక్కువగా మాట్లాడేవారు. లేదంటే నగేశ్ గారితో ఎక్కువగా మాట్లాడేవారు. జయలలితగారికి నవ్వడమంటే చాలా ఇష్టం. అందువలన నగేశ్ గారితో ఎక్కువ కబుర్లు చెప్పించుకునేవారు" అని అన్నారు.

Kutti Padmini
Jayalalitha
  • Loading...

More Telugu News