KCR: కేసీఆర్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారు.. ఆర్టీసీ ఉద్యమం చేయి దాటిపోయింది: బండి సంజయ్

  • ఆర్టీసీ ఉద్యమం ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదు
  • ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కబ్జా చేస్తున్నారు
  • కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుతాం

ఆర్టీసీ కార్మికుల సమ్మెను లెక్క చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని... ఆయన తీరుతో ఆర్మీసీ సమ్మె చేయి దాటిపోయిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమం ఎవరి చేతుల్లోనూ లేదని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులను ముఖ్యమంత్రి కబ్జా చేస్తున్నారని... ఆయన నుంచి ఆర్టీసీ ఆస్తులను తిరిగి లాక్కుంటామని అన్నారు. ఆస్తుల కబ్జానే ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శించారు.

ఆస్తుల కబ్జాపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయని... కేసీఆర్ కు దమ్ముంటే వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలన, కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుతామని చెప్పారు. కరీంనగర్ లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బండి సంజయ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

KCR
TRS
RTC
Bandi Sanjay
BJP
Karimnagar
  • Loading...

More Telugu News