Saidharam Tej: సాయిధరమ్ తేజ్ కు శుభాకాంక్షలు తెలిపిన గంటా శ్రీనివాసరావు

  • నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు
  • ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన గంటా
  • మరిన్ని విజయాలు అందుకోవాలంటూ వ్యాఖ్యలు

మెగా హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా ద్వారా సాయిధరమ్ తేజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మున్ముందు మరిన్ని విజయాలు అందుకుని సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం టీడీపీలో ఉన్న గంటా శ్రీనివాసరావుకు మెగా కుటుంబంతో అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు గంటా ఆ పార్టీలో కీలకనేతగా వ్యవహరించారు. ఇప్పటికీ మెగా కుటుంబ సభ్యులతో ఆయన సన్నిహితంగా మెలుగుతుంటారు.

కాగా,  చిత్రలహరి మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రతి రోజూ పండుగే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా నటిస్తుండగా మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.

Saidharam Tej
Ganta Srinivasa Rao
Tollywood
Chiranjeevi
  • Loading...

More Telugu News