Adivi Sesh: 'మేజర్' కోసం అడివి శేష్ కసరత్తు

  • 'ఎవరు'తో మరో హిట్ కొట్టిన అడివి శేష్
  • బరువు తగ్గేందుకు కసరత్తు 
  • దర్శకుడిగా శశికిరణ్ తిక్క

తెలుగు తెరపై విభిన్నమైన కథలకు ప్రాధాన్యమిచ్చే విలక్షమైన నటుడిగా అడివి శేష్ కి మంచి పేరు వుంది. ఒక్కోసారి ఒక్కో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ను తీసుకుని సక్సెస్ లను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. అలా 'గూఢచారి' .. 'ఎవరు' వంటి సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో చేరిపోయాయి.

తాజాగా ఆయన 'మేజర్' సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఇది. ఈ బయోపిక్ లో డిఫరెంట్ లుక్ తో అడివి శేష్ కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన 10 కేజీల వరకూ బరువు తగ్గనున్నాడు. అందుకోసం అయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆహార నియమాలు పాటిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ నిర్మాణంలో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Adivi Sesh
  • Loading...

More Telugu News