TSRTC: ఆత్మహత్యకు ప్రయత్నించిన టీఎస్ఆర్టీసీ ఉద్యోగి... అడ్డుకున్న సాటి ఉద్యోగులు.. సర్దిచెప్పిన సీఐ!

  • ఆత్మహత్యాయాత్నం చేసిన డ్రైవర్
  • హైదరాబాద్-2 డిపోలో పనిచేస్తున్న రాహుల్
  • సర్ది చెప్పిన పోలీసులు, స్నేహితులు

తన ఉద్యోగం పోయిందని, ఇక ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని వాపోతూ, చనిపోవడానికి సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగిని తోటి కార్మికులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్, మలక్ పేట డిపో వద్ద జరిగింది. తనకు నెలకొచ్చే 16 వేల రూపాయల జీతం రాలేదని, కేసీఆర్ తన ఉద్యోగాన్ని తీసేశాడని ఆరోపించిన, హైదరాబాద్-2 డిపో డ్రైవర్ రాహుల్, నిన్న ధర్నా జరుగుతున్న ప్రాంతంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

 వెంటనే తోటి కార్మికులు అతనిపై నీళ్లు పోసి అడ్డుకున్నారు. ఆపై అతనితో మాట్లాడిన మలక్ పేట సీఐ వెంకట సుబ్బారావు, బతికి సాధించుకోవాలే తప్ప, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. సమస్యలు కొన్ని రోజుల్లో సమసిపోతాయని హామీ ఇచ్చి, అత్మహత్యకు మరోసారి పాల్పడనని లేఖ తీసుకుని వదిలేశారు.

TSRTC
Driver
Sucide Attempt
  • Loading...

More Telugu News