TRS: సీపీఐ కీలక నిర్ణయం.. టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరణ

  • ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి సీపీఐ నిరసన
  • ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది రేపు ప్రకటిస్తాం
  • తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటన

అధికార పార్టీ టీఆర్ఎస్ కు సీపీఐ భారీ షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఈ మేరకు తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది రేపు ప్రకటిస్తామని, ఆర్టీసీ ఉద్యమంలో అగ్రభాగాన ఉండాలని నిర్ణయించామని అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని, వారి సమస్యలు పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

TRS
cpi
Telangana
chada venkat reddy
  • Loading...

More Telugu News