Telugudesam: వర్ల రామయ్యకు పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్

  • పోలీస్ అధికారులపై వర్ల వ్యాఖ్యలపై రగడ
  • వర్ల రామయ్య తన నోరు అదుపులో పెట్టుకోవాలి
  • ఆయన జాతకం మాకు తెలుసు

ఏపీలో అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ అధికారులపై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పోలీస్ అధికారుల జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం మండిపడుతోంది.

ఈ నేపథ్యంలో వర్ల రామయ్యకు పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్ ఇచ్చింది. వర్ల రామయ్య జాతకం తమకు తెలుసు అని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. పోలీసులను దూషిస్తే న్యాయపోరాటం చేస్తాం అని, పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గదని, అనవసరంగా పార్టీ రంగు పులమొద్దని సూచించింది.

Telugudesam
Varla Ramaiah
Andhra Pradesh
Police
  • Loading...

More Telugu News