Rajendra Prasad: 'ఆ నలుగురు' స్థాయికి తగిన సినిమా ఇది: రాజేంద్రప్రసాద్
- బంధాలు ఎంత గొప్పవనేది చెప్పే కథ ఇది
- స్నేహం విలువను చాటిచెబుతుంది
- తెరపై పాత్రలే కనిపిస్తాయన్న రాజేంద్రప్రసాద్
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా 'తోలుబొమ్మలాట' నిర్మితమైంది. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. "42 సంవత్సరాల నా నట జీవితంలో ముందువరుసలో నిలిచే 5 సినిమాల్లో 'తోలుబొమ్మలాట' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో నేను 'సోడాల్రాజు' పాత్రలో కనిపిస్తాను.
బంధాల గొప్పతనాన్ని .. స్నేహం విలువను చాటిచెప్పే చిత్రం ఇది. ' ఆ నలుగురు' తరువాత ఇంతకన్నా చేయడానికి ఇంకేముంటుందిలే అనుకున్నాను. కానీ చేయాల్సింది ఇంకా చాలానే ఉందని చెప్పిన సినిమా ఇది. ఎవరూ నటించడానికి ప్రయత్నించవద్దని నేను మిగతా ఆర్టిస్టులకు చెప్పాను. అలాగే అంటూ వాళ్లు చాలా సహజంగా జీవించారు. అందువల్లనే తెరపై పాత్రలు కనిపిస్తాయిగానీ, ఆర్టిస్టులు కనిపించరు. ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చారు.