YSRCP: ఏ పార్టీ ప్రభుత్వమైనా విధానాలు కొనసాగించడం ధర్మం: టీడీపీ ఎమ్మెల్సీ చెంగలరాయుడు

  • పాత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఇవ్వాలి
  • అడ్డుపుల్ల వేయడం తగదు
  • గత ప్రభుత్వాలు దీన్ని పాటించాయి

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతుండడం సహజమని, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విధానాలను కొనసాగించడం ధర్మమని టీడీపీ ఎమ్మెల్సీ చెంగరాయుడు అన్నారు. ఇప్పటి వరకు వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు దీన్ని పాటించారని, వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాటించాలని కోరారు. పార్టీలు ఏవైనా ప్రభుత్వం శాశ్వతం కాబట్టి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఇవ్వడం పాలనాపరమైన విధానమన్నారు. 2014కు ముందు పాదయాత్ర చేసిన చంద్రబాబునాయుడు తానిచ్చిన హామీలు నెరవేర్చారని, 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్‌ కూడా తన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు.

YSRCP
mlc chengalryayudu
  • Loading...

More Telugu News