Maharashtra: బీజేపీని గెలిపిస్తే పాకిస్థాన్‌పై అణుబాంబు పడినట్టే: యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌

  • ఈ ఎన్నికలు మీ దేశభక్తికి నిదర్శనం
  • 370 రద్దు నేపథ్యంలో మీ మద్దతు అవసరం
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఠానేలోని మీరాభయందర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపి అభ్యర్థి నరేంద్ర మెహతాకు మద్దతుగా నిన్నరాత్రి ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో, ఈ ఎన్నికల్లో బీజేపీకి మీ మద్దతు చాలా అవసరమన్నారు. ఈ ఎన్నికలు మీలోని దేశభక్తిని తెలియజేస్తాయని చెప్పారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే పాకిస్థాన్‌పై అణుబాంబు పడినట్టేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో అక్టోబరు 21న ఎన్నికలు జరగనున్నాయి.

Maharashtra
thane
BJP
kesavaprasad mourya
Pakistan
autombomb
  • Loading...

More Telugu News